గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలంలో నీటి మట్టం  పెరిగింది గోదావరి వరద ప్రవాహం ఎక్కువ కావడంతో పోలవరం ఎగువనున్న కొత్తూరు కాజ్వే వద్ద సుమారు పది అడుగుల నీటిమట్టం చేరింది. పోలవరం నుంచి ఏజెన్సీకి గ్రామాలకు వెళ్లే రహదారి కావడంతో పునరావాస గ్రామాలైన 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తూరు కాజ్వే ను పోలవరం రెవిన్యూ సిబ్బంది పర్యవేక్షించారు. డిప్యూటీ తహసిల్దార్ జి అర్జున్ రావు మాట్లాడుతూ  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు ఎగువనున్న పునరావాస గ్రామాలకు మూడు నెలలకు సరిపడా నిత్యవసర వస్తువులు ఏజెన్సీ గ్రామాలలో నిల్వ ఉంచామన్నారు . ప్రాజెక్టు దిగువన గల పోలవరం, పట్టిసీమ , గుటాల, ఎల్ ఎన్ డి పేట గ్రామాలలో పునరావాస కేంద్రాలు  ఏర్పాటు చేశామని అన్నారు. ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ ,ఆరోగ్య కేంద్రాలను, పంచాయతీలను ముందుగానే అలర్ట్ చేసి 19 గ్రామ ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు . కొత్తూరు కాజ్వే లోకి నీరు రావడం వల్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు పడవలు  ఏర్పాటు చేసి పడవల ద్వారా రెవిన్యూ మరియు పోలీస్ వారి ఆధ్వర్యంలో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో  రెవెన్యూ సిబ్బంది. డిప్యూటీ తాసిల్దారు జి అర్జున్ రావు, సివిల్ సప్లై డిటి ఎస్ కె సలీం మరియు రామారావు, రాంబాబు, పోలీస్ సిబ్బంది సీఐ ఎ ఎన్ ఎన్ మూర్తి , ఎస్సై ఆర్ శ్రీను,హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ  పాల్గొన్నారు.

×

Hello!

Click one of our Representatives below to chat on WhatsApp or send us an email to zenithangle365@gmail.com

× How can I help you?