నగరంలో సందడి చేసిన ఇస్మార్ట్ శంకర్  టీం

 వరంగల్ న్యూస్  రవీందర్ గుప్తా ;
హన్మకొండ, ప్రజా పాలన: నగరంలో ఇస్మార్ట్ శంకర్   సినిమా టీం సందడి చేశారు. సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి దర్శక నిర్మాతలు పూరి జగన్నాథ్ ఛార్మి హీరోయిన్ నిధి అగర్వాల్ హాజరయ్యారు.ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ఇస్మార్ట్ శంకర్ సినిమా ఊహించని విజయాన్ని అందించిందని తెలుగు రాష్ట్రాల్లో బంపర్ విజయం సాధించి మాలో మంచి జోష్ అనిపించింది అని అన్నారు. హీరో రామ్ లో ఉన్న విభిన్న లక్షణాలను వాడుకొని వైవిధ్యమైన కథతో తెరకెక్కించామని ఈ చిత్రాన్ని ప్రజలు ఆదరించి ఇంత పెద్ద విజయాన్ని అందించిన అందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు  ఇస్మార్ట్ శంకర్-2 ని తీయమని కోరుతున్నారు దానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి అని అన్నారు. చిత్ర నిర్మాత చార్మి మాట్లాడుతూ వరంగల్ లో అన్ని థియేటర్లు అన్ని ఆటలు హౌస్ ఫుల్ అవుతున్నాయి చాలా సంతోషంగా ఉంది తెలంగాణలో ఎక్కడికెళ్లినా మంచి స్పందన వస్తుంది.నైజాం డిస్ట్రిబ్యూటర్ ఇస్మార్ట్ శ్రీను మాట్లాడుతూ నమ్మకం పెట్టుకొని సినిమా ఫస్ట్ లుక్ చూసినప్పుడే మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం నాలో పెరిగిందని అన్నారు చాలామంది ఇన్ని డబ్బులు ఎందుకు వెచ్చిస్తున్నావని హెచ్చరించిన పూరి జగన్నాథ్ చార్మి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారిపై నమ్మకంతో సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది వారి సహకారానికి చాలా సంతోషంగా ఉంది. నైజాం ఏరియాలో అన్ని థియేటర్లు అన్ని షోలు హౌస్ ఫుల్  అవుతుండడం చాలా    సంతోషంగా  ఉంది ఇస్మార్ట్ శంకర్-2 లో కొన్ని షెడ్యూల్ను వరంగల్లో తీయాలని  డైరెక్టర్ పూరి జగన్నాథ్,చిత్ర నిర్మాత ఛార్మి ని కోరుతున్న ఆ నారు. చిత్ర హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఇంత మంచి అవకాశాన్ని తనకు ఇచ్చిన పూరి జగన్నాథ్ చార్మి ల కు కృతజ్ఞతలు తెలిపారు.చిత్ర విజయానికి కారకులైన తెలంగాణ ప్రజలకు వరంగల్ ప్రజలకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రుణపడి ఉంటా అన్నారు.
×

Hello!

Click one of our Representatives below to chat on WhatsApp or send us an email to zenithangle365@gmail.com

× How can I help you?