పిచ్చి కుక్కల కోసం గాలింపు చర్యలు:- ఈదుల.రాజశేఖర్ రెడ్డి

మంగళవారం నాడు ఎర్రగొండపాలెం మేజర్ గ్రామ పంచాయితీ కార్యాలయం పరిధిలో  పిచ్చి కుక్కల స్వైర విహారం  కొనసాగుతుంది.దీంతో ఇప్పటికే  ఆయా వీధులలో  పిచ్చికుక్కల దాడుల్లో 24  మంది పసి పిల్లల పై  దాడులు జరిగినట్లుగా   స్థానిక ప్రభుత్వ వైద్యశాల లో  నమోదైన  సమాచారం.ఈ  మేరకు  తక్షణమే స్పందించిన ఎర్రగొండపాలెం మేజర్ గ్రామ పంచాయితీ  కార్యదర్శి ఈదుల రాజశేఖర్ రెడ్డి  పంచాయతీ సిబ్బంది  సహకారంతో  పిచ్చి కుక్కల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు  సదరు పాత్రికేయులకు సమాచారం  తెలిపారు . తక్షణమే పిచ్చి కుక్కలను గుర్తించి వెంటనే  సంబంధిత వ్యాక్సిన్ ద్వారా  సంహరించ వలసిందిగా ఆయా సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం  జరిగిందంటూ  ఆయన పేర్కొన్నారు.అంతేకాకుండా  పెంపుడు కుక్కలకు యాజమాన్యాలు తక్షణమే స్పందించి వారి వారి పెంపుడు కుక్కలను  సంబంధిత గొలుసులు ద్వారా బయటకు రాకుండా చూడవలసిందిగా  ఆయన కోరారు.
×

Hello!

Click one of our Representatives below to chat on WhatsApp or send us an email to zenithangle365@gmail.com

× How can I help you?