ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి

రాజోలి (జెనిత్ న్యూస్) : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని జోగులాంబ గద్వాల జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి,నిషాక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రాజోలి చేనేత శ్రామిక సేవాసమితి ఆధ్వర్యంలో చేనేత కార్మికుల కోసం అగర్వాల్ మరియు ట్రాన్స్పోర్ట్ సమస్త వారు నిర్మించిన జనత వర్క్ షెడ్యూల్లో చేనేత కార్మికులతో కలిసి హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి నిషాక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. గతంలో షెడ్యూల్లో కూడా హరితహారం కార్యక్రమంలో 30 మొక్కలు నాటడం జరిగిందని ఆయన అన్నారు. మొక్కల కోసం రక్షణ చేసి వాటిని పెంచి పోషించడం జరిగింది. ఇప్పుడు ఆ మొక్కలు ఎండాకాలంలో మంచి నీడనిస్తూ చల్లటి వాతావరణం అందిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి నిషాక్, రాజోలి చేనేత శ్రామిక సేవా సమితి అధ్యక్షుడు దర్జీ వీరేష్, చేనేత కార్మికులు కృష్ణ, బ్రహ్మ, వీరేష్, గోపాల్, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
×

Hello!

Click one of our Representatives below to chat on WhatsApp or send us an email to zenithangle365@gmail.com

× How can I help you?