బూర్జ జెనిత్ న్యూస్ : శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడ గ్రామంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న భూ వివాదం రోజురోజుకు జటిలం అవుతుంది.తోటవాడ లో నివసిస్తున్న దళితులకు అప్పటిలో ప్రభుత్వం భూమిలో సుమా130 కుటుంబాలకు నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈభూమి సర్వే నెం. 381 లో 4-73 సెంట్లులో దళిత కుతంబాలు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారాలు దళితులకు సంబంధించిన భూమిని అక్రమంగా ఆక్రమించే ప్రయత్నంలో ఉన్నారని బదితులు గతంలో జాయింట్ కలెక్టర్ కి వినతులు ఇచ్చి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ రజినీకాంత్ సంబందిత మండల తాసిల్దార్ కి రిపర్ చేయడం జరిగింది.దీనితో రియల్ఎస్టేట్ వ్యాపారాలకు వ్యేతిరేకంగా వెళ్ళినందుకు మా పై కక్షతో దాడిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అదేవిధంగా తాతలనాటి నుంచి ఆ భూమినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని కావన ఆ స్థాలలుని జిల్లా కలెక్టర్ జె.నివాస్,జిల్లా యస్.పి.అమ్మిరెడ్డి కి పిర్యాదు చేసారు. మా 130 కుటంబాలకు ఇప్పించవలిసిందిగా తోటవాడ దళితులు కోరుచున్నారు.