*స్వయంబుగా వెలసిన మానసా దేవి ఆలయం*

జగిత్యాల: (జనిత్ న్యూస్ బ్యూరో-పిప్పరి శ్రీనివాస్):

జగిత్యాల జిల్లా:జగిత్యాల పట్టణంలో గలశ్రీవెంకటేశ్వర ఆర్యవైశ్య సంక్షేమ సంఘం కూరగాయల మార్కెట్ ఏరియా లక్ష్మణ వీధి సంఘ సభ్యులు ఆషాడ మాసం వనభోజనం సందర్భంగామానసాదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించు కున్నారు.ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ..స్వయంబుగా వెలిసిన అమ్మవారు ఆలయం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామములో రాతికి వెలిసిన అమ్మవారు అని తెలిపారు.ఈ అమ్మవారు వెలిసాక అమ్మవారి ఆలయం కట్టించాలనే సంకల్పంతో గ్రామ సర్పంచ్ గ్రామ సభ్యులు నిర్ణయానికి వచ్చి భూమి పూజ చేసి ఆలయాన్ని ప్రతిష్ట చేసిన రోజుకు సరిగ్గా 9నెలల ఒక్క రోజులో ఆలయంతో పాటు ఆలయ ప్రతిష్ట పూర్తి జరిగింది అని, తల్లి గర్భమున జన్మించే ఏ ఒక్క శిశువు కూడా 9నెలల ఒక్క రోజు వుంటుంది అని, స్వయంభుగా వెలిసిన అమ్మవారు తల్లి గర్బము నుండి జన్మించినట్లు మా ఊరిలో వెలిసింది అని తెలిపారు. అమ్మవారు రెండు సంవత్సరాల క్రితం వెలిసి ఒక్క సంవత్సరం కాలం నుండి భక్తుల పూజలందు కొనుచున్నది అని తెలిపారు. అమ్మవారు చాలా మహిమాన్వితం అని రుజువు చేసేందులకు అమ్మవారు సంతానం లేని వారికి సంతానం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమై వెలసిల్లి భక్తుల ముడుపులు అందు కుంటుందని తెలిపారు, విశేషం ఏమిటంటే ఆలయ నిర్మాణం సమయంలో ఆలయ పూజారులు నిదిరిస్తున్న సమయం లో సాక్షాత్తు హనుమంతుడు గదాషూలం పట్టుకొని అటు ఇటు తిరుగుతూ కనిపించాడని ఆలయ విశిష్టత ను తెలిపారు
×

Hello!

Click one of our Representatives below to chat on WhatsApp or send us an email to zenithangle365@gmail.com

× How can I help you?